Home Page SliderTelangana

రాహుల్‌కి బీసీలంటే ఎందుకు అంత చులకన?: ఎంపీ లక్ష్మణ్

ఢిల్లీ: 163 మంది బీసీలను బీజేపీ ఎమ్మెల్సీలుగా చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలు ప్రధాని మోడీ వైపు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీసీలంటే ఎందుకంత చిన్నచూపు? అని ప్రశ్నించారు. బీసీలకు హామీ ఇచ్చి సీఎం కేసీఆర్ మాట మార్చారని ఆరోపణ. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ బీసీల వ్యతిరేక పార్టీలేనని విమర్శించారు. బీజేపీ రాబోయే జాబితాలో బీసీలకు అధిక స్థానాలు కేటాయిస్తామని లక్ష్మణ్ వెల్లడించారు. బీసీల ఆత్మవిశ్వాసం కాపాడతామన్నారు.