Home Page SliderNationalNews

నాగుల చవితికి ఎందుకు కూరలు కట్ చేయరు?

కార్తీక మాసంలో వచ్చే పండుగ నాగుల చవితి. తెలుగు రాష్ట్రాలలో దీపావళి తర్వాత వచ్చే చవితి రోజును నాగుల చవితిగా జరుపుకుంటారు. నేడు (నవంబర్ 5) నాగుల చవితి రోజు భక్తులు పాము పుట్టకు గానీ, దేవాలయాలలో నాగ శిలలకు గానీ పూజలు చేస్తారు. అక్కడ పాలు పోసి, ప్రదక్షిణలు చేసి పూజలు చేస్తారు. వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో ప్రకృతిని పూజించడం అనాదిగా వస్తూన్న ఆచారం. ఈ రోజున ప్రకృతికి హాని తలపెట్టరాదని భావిస్తారు. అందుకే చెట్టుకు, పుట్టకు ఎలాంటి హానీ తలపెట్టరు. కూరలు కట్ చేయడం కానీ, మట్టిని తవ్వడం కానీ, భూమిని దున్నడం గానీ చేయరు. కత్తులు వాడరు. మట్టి పాత్రలలో వంట చేసుకుని, దుంపలు గానీ, పచ్చి చలిమిడి, నువ్వులు, బెల్లం కలిపిన చిమ్మిలి వంటి పదార్థాలను ఆహారంగా స్వీకరిస్తారు. పొలాలలో పనులు చేసే రైతులు పాము కాటు బారిన పడకుండా ఉండాలని నాగేంద్రుని ప్రార్థిస్తారు.