అమ్మాయిలా డ్రెస్ ఎందుకు వేసుకోలేదు.. కీర్తిసురేష్ రఘు తాతా ట్రైలర్
నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న రఘు తాతా. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ట్రైలర్‌ను లాంచ్ చేశారు మేకర్స్.
నీవెందుకు అమ్మాయిలా సరిగ్గా డ్రెస్ వేసుకోలేదని కీర్తిసురేష్‌ను అడుగుతుంటే.. సరైన అమ్మాయిని కాబట్టే నాకు ఆసక్తి లేదంటోన్న డైలాగ్స్‌తో షురూ అయింది ట్రైలర్. మొదట అమ్మాయిలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకో అని కీర్తిసురేష్‌కు ఉన్నతాధికారి చెప్తున్నాడు. మరోవైపు రవీంద్ర విజయ్, కీర్తిసురేష్ లవ్ ట్రాక్‌తోపాటు కీర్తిసురేష్ హిందీ నేర్చుకునే సన్నివేశాలతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. హిందీ రాని తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే నేపథ్యంలో ఆసక్తికరంగా ట్రైలర్‌ని కట్ చేశాడు.
మరోవైపు కీర్తిసురేష్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న సీన్లతో షురూ అయిన టీజర్‌లో మాస్టర్ హిందీలో శిక్షణ ఇస్తుండగా.. నాకు హిందీ రాదు తమిళంలో చెప్పండి సార్ అంటోంది కీర్తిసురేష్. హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే దాన్ని కీర్తిసురేష్ తిరస్కరిస్తుంది. రఘుతాతా తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ మూవీని కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ ప్రాంచైజీలను తెరకెక్కించిన పాపులర్ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ తెరకెక్కిస్తూండంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి షాన్ రోల్డన్ సంగీతం అందిస్తున్నాడు.