NationalPolitics

టెంపుల్ వద్ద పూలమ్మే మహిళకు ఐఫోన్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది?

పిల్లలపై ప్రేమ ఎప్పుడూ కూడా ఒక స్థాయిలో ఉండాలి. అంతకు మించి ఉన్నప్పుడు మాత్రమే అసలు సమస్యలు వస్తాయి. ఒక్కగానొక్క కొడుకు అంటూ చాలా మంది తమ బిడ్డలను గారాబం చేస్తుంటారు. పిల్లల కోసం కాకుంటే తాము జీవస్తోంది ఎందుకోసమంటూ కుండబద్ధలుకొడుతుంటారు. నిజమే. పిల్లల్ని కని వారిని పెద్ద చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. కానీ పిల్లలను చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చూసుకోవాల్సింది కూడా తల్లిదండ్రులే. పిల్లల్ని మంచిగా పెంచాలి. అలాగే వారికి మంచి బుద్ధలు నేర్పించాలి. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలతో పిల్లల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు వస్తాయ్… ఇలాంటి ఘటన ఇటీవల సంచలనం కలిగించింది.

సామాన్యమైన ఐఫోన్ కొనాలంటేనే తక్కువలో తక్కువ 50 వేలుండాలి. ఇంకా చెప్పాలంటే లక్ష రూపాయలు లేనిదే ఐఫోన్ కొనలేం. ఐ ఫోన్ వాడటం చేత రాకున్నా చాలా మంది డబ్బుందని ఐఫోన్ కొంటుంటారు. మరింకొందరు సెక్యురిటీ పర్పస్ కోసం కొంటుంటారు. ఇంకొందరు గిఫ్ట్ గా వచ్చిందని ఐఫోన్ వాడుతుంటారు. కానీ ఓ మహిళ తన బిడ్డ మారం చేస్తు్న్నాడని, మూడు రోజులుగా అన్నం తినడం మానేశాడని ఐఫోన్ కొనివ్వాలని నిర్ణయించింది. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ మొబైల్ షాపులో తన బిడ్డను తీసుకొచ్చి ఫోన్ కొనిచ్చేందుకు చూసిన షాపు యజమానులకు ఒక్కసారిగా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంతకీ మీరెందుకు వచ్చారన్న సిల్లీ ప్రశ్నలు వేసే షాప్ ఓనర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మహిళ బ్యాగులోంచి డబ్బును తీసియ్యడంతో మారు మాట్లాడకుండా ఫోన్ వేరియంట్స్ అన్నీ చూపించారు. తన బిడ్డ ఐఫోన్ కొనివ్వనందుకు 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాడని ఆమె తెలిపింది.

“నేను గుడి బయట పూలు అమ్ముతాను, నా కొడుకు తనకు ఐఫోన్ కావాలని మూడు రోజులుగా ఏమీ తినలేదు” అని ఆమె చెప్పింది. కనీసం మంచినీళ్లు కూడా తాగకపోవడంతో ఆందోళనకు గురయ్యానంది. ఆశలన్నీ బిడ్డ కోసమేనని భావించి, కొడుకు డిమాండ్‌కు అంగీకరించానని చెప్పింది. ఫోన్ అయితే కొనిచ్చింది గానీ ఆ డబ్బును తిరిగి సంపాదించాలని కొడుక్కు షరతు విధించింది. తన బిడ్డకు తాను ఫోన్ కొనేందుకు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి సంపాదించి తనకు ఇవ్వాలని ఆమె కోరుకుంది. అయితే ఈ వీడియోను ఓ అజ్ఞాత వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫోన్ కొనేందుకు వచ్చిన తల్లిని షాపు యజమాని అనేక ప్రశ్నలు వేశారు. “అధిక ప్రేమ పిల్లలను ఎప్పుడూ నాశనం చేస్తుంది. వారిని ఎలా కట్టడి చేస్తారో ఆలోచించాలన్న సందేశం ఇప్పుడు నెట్టింటి విన్పిస్తోంది. షేర్ చేసిన ఈ వీడియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆరు లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. 10 వేలకు పైగా లైక్స్ పొందింది. కొందరు దీనిపై అనేక వర్ణనలు చేస్తున్నారు. తమ కోరికలను నెరవేర్చుకునేందుకు ఇలాంటి వారు ఏదైనా చేస్తారన్న వర్షన్ కొందరు విన్పిస్తున్నారు.