Andhra PradeshHome Page Slider

లోకేష్ అమిత్ షాను ఎందుకు కలిశారంటే..?

నారా లోకేష్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. కాగా అమిత్ షాతో భేటి ముగిసిన అనంతరం నారా లోకేష్‌లో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ ,ఆరోగ్యం,జైలులో భద్రతపై ఆందోళన చెందుతున్నట్లు లోకేష్ అమిత్ షాకు తెలిపారు. అయితే అమిత్ షా తనను సీఐడీ ఎందుకు పిలిచింది?ఎన్ని కేసులు పెట్టిందని అడిగారన్నారు.ఈ ప్రశ్నలకు వైసీపీ పార్టీ రాజకీయ కక్ష్యతోనే టీడీపీని ఇబ్బంది పెడుతుందని చెప్పానన్నారు. కాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి అమిత్ షా తనను కలవాలనుకుంటున్నట్లు చెప్పారన్నారు. కిషన్ రెడ్డి సలహాతోనే అమిత్ షాతో భేటి అయ్యానని నారా లోకేష్ స్పష్టం చేశారు.అయితే నారా లోకేష్ అమిత్ షాతో భేటి అవడంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు “టీడీపీని బీజేపీలో విలీనం చేయాడానికే ఈ భేటి” అని సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.