కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్?
కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లావ్? ఎవరికోసం వెళ్లావ్? ఎవరిని కలిశావ్? ఏం చేద్దామనుకుంటున్నావ్ అని ప్రశ్నించారు. నీవు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, విచారణకు గవర్నర్ నుంచి అనుమతి రాకుండా ఉండేందుకే ఢిల్లీకి వెళ్లావా.. అని ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర రైతులను ఉద్దరిస్తాన్న మీరు.. అక్కడ ఎందుకు పోటీ చేయడం లేదని నిలదీశారు. నిన్నటి వరకు బీజేపీతో పోరాటం చేశానని చెప్పుకున్న మీరు ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీకి ఓటు వేయాలని దేని కోసం పిలుపు ఇస్తున్నారని నిలదీశారు.