ధోని ఇలా ఎందుకు చేశాడు..?
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే, ధోనికి అభిమానుల కొదువ లేదు. తాజాగా ఓ అభిమాని.. పేరు గౌరవ్ కుమార్ ఆయన్ను కలిసేందుకు ఢిల్లీ నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీలోని ధోని ఫాంహౌస్ కు సుమారు 1,200 కి.మీ. సైకిల్ మీద వెళ్లాడు. ధోని ఫాంహౌస్ ఎదుట టెంట్ వేసుకుని 5 రోజులు అక్కడే వెయిట్ చేశాడు. అయినప్పటికీ ధోని అతన్ని కలువలేదు. దీంతో ఆ అభిమాని చాలా నిరాశకు గురయ్యాడు. ధోని కారులో వెళ్లే టైంలో ఆయన్ను కలిసేందుకు యత్నించినా మహి పట్టించుకోలేదని ఆ అభిమాని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అయితే.. తన అభిమాని పట్ల ధోని ప్రదర్శించిన బిహేవియర్ పై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.