Home Page SliderNational

డబుల్ రోల్‌లో అసలు గేమ్‌చేంజర్‌ ఎవరు?

రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ అప్‌డేట్‌ కోసం అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నట్టు గతంలో నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన రామ్‌చరణ్‌  డబ్బింగ్‌ మినహా అంతా పూర్తయింది. త్వరలోనే తన పాత్రకు రామ్‌చరణ్‌ డబ్బింగ్‌ చెప్పనున్నారు. ఇందులో ఆయన తండ్రీకొడుకులుగా డబుల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఓ పాత్ర పేరు అప్పన్న కాగా, మరో పాత్ర పేరు రామ్‌నందన్‌ ఐఏఎస్‌ అని తెలుస్తోంది. రెండు పాత్రలూ పవర్‌ఫుల్‌గా ఉంటాయని సమాచారం. కొన్నిరోజుల క్రితం ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదల చేశారు. ‘జరగండి జరగండి జరగండీ..’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సెప్టెంబర్‌లో సెకండ్‌ సింగిల్‌ విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ఓ పోస్టర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు తమన్‌ ఇస్తున్న అప్‌డేట్లు కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. అంజలి, కైరా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలను పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.