అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టిన తెలుగమ్మాయి
మహిళల అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఇప్పటికే హ్యాట్రిక్ విజయంతో దూసుకుపోతోంది. తాజాగా తెలుగమ్మాయి గొంగడి త్రిష స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ సాధించి అదరగొట్టింది. దీనితో స్కాట్లాండుకు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్ ఇండియా నిర్దేశించింది. కేవలం 53 బంతులలోనే 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెంచరీ నమోదు చేసింది. దీనితో అండర్ 19 టీ 20లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. అలాగే ఓపెనర్ కమలిని కూడా 51 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించింది.