రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ?
తెలంగాణ: రాష్ట్రంలో కాషాయ దళపతి ఎవరనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ బీజేపీలోని నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొత్త నీరు, కొత్త నాయకత్వం అవసరమంటూ ఈటల కామెంట్ చేయగా.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్నవారికే పగ్గాలు ఇవ్వాలని రాజాసింగ్ అన్నారు. దీంతో వీరిద్దరూ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం.