తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరు?
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు? గత సభలో ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాజాసింగ్‌నే కంటిన్యూ చేయమంటారా? లేక కొత్తగా ఎన్నికైనవారిలో ఎవరికైనా అప్పగిస్తారా? తాజాగా అసెంబ్లీకి ఎన్నికైన 8 మంది కమలం పార్టీ ఎమ్మెల్యేల్లో అందరికంటే సీనియర్ రాజాసింగ్ మాత్రమే. అందుకే ఇప్పుడీ విషయంపై బీజేపీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. అసలు బీజేపీ పార్టీ నిర్ణయం ఎలా తీసుకుంటారు అనేది ప్రశ్న?.. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలాటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, మహేశ్వరరెడ్డి కొంతకాలం క్రితమే బీజేపీలోకి వచ్చారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ టైమ్ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

