ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే!
న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ మెలీ కెర్‌ను.. ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీకి ఆమె ఎంపికైంది. 2024లో అద్భుతమైన మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డుకెక్కింది. క్రికెట్‌కు చెందిన మూడు ఫార్మాట్లలో…. కెర్ గత ఏడాది అద్భుత ప్రదర్శన ఇచ్చింది. మూడు ఫార్మాట్లలోనూ ఆమె వరల్డ్‌క్లాస్ ఆల్‌రౌండర్‌గా నిలిచింది. ప్రపంచంలోని మేటి మహిళా లెగ్ స్పిన్ బౌలర్‌గా కెర్ కీర్తికెక్కింది. రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీ అవార్డును 2017 నుంచి ప్రకటిస్తున్నారు. ఎలిసీ పెర్రీ(ఆస్ట్రేలియా), స్మృతి మందాన(ఇండియా), స్కీవర్ బ్రుంట్(ఇంగ్లండ్) ఇప్పటి వరకు ఈ అవార్డును గెలుచుకున్నారు.రేచల్ అవార్డును గెలుచుకున్న తొలి కివీస్ ప్లేయర్‌గా కెర్ నిలిచింది. ఐసీసీ మహిళా క్రికెటర్ అవార్డును కూడా గెలవడం కివీస్ క్రికెటర్‌కు ఇదే మొదటిసారి.