చెన్నైకి ధోనీ స్థానంలో కెప్టెన్‌గా ఎవరు సరిపోతారంటే!?
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే కెప్టెన్ IPL కెరీర్‌కు గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. దీంతో సీఎస్కేకు ఎవరు కెప్టెన్ అవుతారన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వారసుడిగా ఉండాలని భారత బ్యాటర్ CSK మాజీ ఆటగాడు కేదార్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ 2023 ధోనికి చివరి సీజన్ గా భావిస్తున్నారు. CSK కెప్టెన్ పదవికి పోటీదారుగా బెన్ స్టోక్స్‌ను జాదవ్ పేర్కొన్నాడు. అయితే ఇంగ్లండ్ స్టార్ కెప్టెన్ రేసులో ఉండాలంటే ప్రస్తుత సీజన్‌లో బాగా ఆడాలని చెప్పాడు. ఎంఎస్ ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ CSK కెప్టెన్‌గా ఉండవచ్చని భావిస్తున్నానన్నారు. రవీంద్ర జడేజాతో పాటు బెన్ స్టోక్స్ కూడా కెప్టెన్ రేసులో ఉండొచ్చన్నాడు. కానీ దాని కోసం స్టోక్స్ ఈ సంవత్సరం CSK కోసం బాగా ఆడాల్సి ఉంటుందన్నాడు. అందుకే రీతురాజ్‌కు ఎక్కువ ఛాన్స్ ఉందని భావిస్తున్నానన్నాడు. MS ధోని తర్వాత CSK కెప్టెన్‌గా గైక్వాడ్ ఉత్తమ ఎంపికని IPL వ్యాఖ్యాత కేదార్ జాదవ్ అన్నాడు.

ఐపీఎల్ 2023 వేలంలో 16.25 కోట్ల భారీ మొత్తానికి స్టోక్స్‌తో CSK సంతకం చేసింది. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ 2019 నుండి CSK జట్టులో భాగంగా ఉన్నాడు. ఫ్రాంచైజీతో మొదటి సీజన్‌లో అతనికి అవకాశం లభించనప్పటికీ, గైక్వాడ్ 2020లో ఆరు మ్యాచ్‌లు ఆడి సత్తా చాటాడు. నాటి నుంచి నేటి వరకు జట్టుకు బలమైన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కొన్నేళ్లుగా, కుడిచేతి వాటం కలిగిన ఓపెనర్ CSK బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకగా మారాడు. IPLలో 40కి పైగా సగటుతోపాటు, స్ట్రైక్ రేట్ 130కి పైగా ఉన్న ఆటగాడిగా ఉన్నాడు. IPL 2022కి ముందు ధోనీ కెప్టెన్సీ బ్యాటన్‌ను జడేజాకు అందించాడు. అయితే ఈ సీజన్‌లో జట్టు పేలవమైన ప్రదర్శన జడేజా నాయకత్వ బాధ్యతను మధ్యలోనే వదిలివేయడంతో ధోని మళ్లీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.

