షెల్లీ ఒబెరాయ్ ఎవరు? ఢిల్లీ మేయర్ కీలక సమాచారం
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షెల్లీ ఒబెరాయ్ మొదటిసారి కౌన్సిలర్. గత ఏడాది డిసెంబర్‌లో తూర్పు పటేల్ నగర్ వార్డు నుంచి ఢిల్లీ సివిక్ బాడీ ఎన్నికల్లో గెలుపొందారు. డిసెంబరు 8న జరిగిన ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో AAP విజయం సాధించింది. ఎంసీడీపై 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి తెరపడింది.
39 ఏళ్ల ఒబెరాయ్ కోజికోడ్‌లోని ఐఐఎంలో మేనేజ్‌మెంట్ అభ్యసించారు.
షెల్లీ ఒబెరాయ్ 2014 నుండి AAPతో అనుబంధం కలిగి ఉన్నారు. 2020లో పార్టీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా ఎంపికయ్యారు.
ఇండియన్ కామర్స్ అసోసియేషన్‌లో ఒబెరాయ్ జీవితకాల సభ్యురాలు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి పీహెచ్‌డీ చేశారు. ఆమె వివిధ సమావేశాలలో అనేక అవార్డులను గెలుచుకున్నారు.
ఒబెరాయ్ తండ్రి సతీష్ కుమార్ వ్యాపారవేత్త, తల్లి సరోజ గృహిణి. ఆమెకు ఒక సోదరుడు మరియు సోదరి ఉన్నారు.


