ఏపీలో “తల్లికి వందనం” పథకానికి అర్హులు ఎవరంటే..?
ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందా లేదా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను పెంచి ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని నిన్న అసంబ్లీలో చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీలో తల్లికి వందనం పథకంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మాట్లాడుతూ..తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ పథకం మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలని ఆయన కోరారు. కాగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మా ప్రభుత్వంలో జరగకుండా చూడడమే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.15,000 ఇస్తామన్నారు. అయితే ఇందులో సందేహం ఏమి లేదని మంత్రి తెలిపారు. ఏపీలో “తల్లికి వందనం పథకం” ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వర్తింస్తుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.