బుమ్రాకు ఫేవరెట్ కెప్టెన్ ఎవరంటే..?
టీమిండియా ఆటగాడు జస్‌ప్రీత్ బుమ్రా తన ఫేవరెట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు. తన అభిమాన భారత కెప్టెన్ తానే అని బదులిచ్చాడు. దీనితో ఆ ప్రశ్న అడిగిన వారు తెల్లబోయారు. భారత జట్టుకు బుమ్రా కూడా కొన్ని మ్యూచ్‌లకు కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే. కూల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీలో తాను ఆరంగ్రేట్రం చేశానని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఉన్నప్పుడు జట్టు మొత్తం ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఎక్కువ కాలం పాటు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ మధ్య జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో బుమ్రా మంచి పెర్‌ఫార్మెన్స్ కనపరిచిన సంగతి తెలిసిందే.

