శాడిస్టు అంటే ఎవరు? శాడిజమంటే ఏంటి? చంద్రబాబుపై జగన్ నిప్పులు
చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌తో ఫిర్యాదు చేయించి పింఛన్లను అడ్డుకున్నారన్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న యుద్ధమని ప్రజలు గమనించాలన్నారు. దగా,మోసం, కుట్రలు, చంద్రబాబు మార్క్ రాజకీయమన్నారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తోందన్నారు. కానీ ఎన్నికలను చూపించి వాలంటీర్లను ఇంటింటికీ వెళ్లి పింఛన్ ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. అవ్వాతాతలను చంపిన దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అవ్వాతాతలను చంపిన చంద్రబాబును శాడిస్టు అంటానన్నారు. 56 నెలలుగా ఒకటో తేదీనే ఇంటింటికీ పింఛన్ అందించామన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపు పలుకుతారన్నారు. ఓటేసేటప్పడు ఆలోచించి వేయాలన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అడ్డదారిలోనే వెళ్తారన్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయం మోసం, వెన్నుపోటు, కుట్రలన్నారు. గతంలో వెయ్యి పింఛన్ ను మూడు వేలకు పెంచానన్నారు.
