పవన్ కళ్యాణ్‌ను మందకృష్ణతో తిట్టించింది ఎవరు?
మందకృష్ణ మాదిగ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఆగ్రహం వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. హోం మంత్రి అనితను పవన్ కళ్యాణ్ విమర్శించడంతో మందకృష్ణ మాదిగ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. మాదిగ సమాజానికి చెందిన హోం మంత్రి అనితను పవన్ అవమానించారన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందన్న పవన్ అది హోం మంత్రినే కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబును అన్నట్టే అన్నారు. కానీ ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు రాజకీయం ఉందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పవన్ అభిమానులు మందకృష్ణను తిడుతున్నారు కానీ, ఆయనతో తిట్టించిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే బయటకు వచ్చి మీడియాతో మందకృష్ణ మాట్లాడారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.