Home Page SliderTelangana

నాకే నోటీసులు ఇస్తారా..?

సొంత పార్టీ నాయకులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నవార్నింగ్ ఇచ్చారు. నాకు నోటీసులు ఇవ్వడానికి మీరెవరు.. కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా అంటూ చెలరేగిపోయారు. కాంగ్రెస్ పార్టీ మాది.. నన్ను బెదిరించాలని చూస్తే నడవదని సీరియస్ అయ్యారు. నాకు అన్యాయం చేయాలని చూస్తే పండవెట్టి తొక్కుతా అంటూ తీవ్ర పదజాలంతో ఆగ్రహించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కులగణన సర్వే బాలేదని చెప్పకుండా, పారదర్శకంగా ఉందని భజన చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది సమగ్ర కుల సర్వే కాదు.. అగ్రకుల సర్వే అని తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్లు చేశారు.