News Alert

ఇండియా, అమెరికాకు తప్పనిసరి భాగస్వామి.. స్పష్టం చేసిన వైట్ హౌస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇండియా అనుసరిస్తున్న వైఖరిపై అమెరికా గుస్సాగా ఉంది. ఐతే మొత్తం వ్యవహారంలో ఇండియా చేస్తోందేమీ లేదని అమెరికా ఇప్పుడిప్పుడే నిర్ధారణకు వస్తోన్నట్టు కన్పిస్తోంది. ముఖ్యంగా ముడి చమురు ఉత్పత్తులపై ఇండియా 90 శాతానికి పైగా ఆధారపడి ఉన్న సమయంలో… ఆ దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించరాదన్న ఉద్దేశం అమెరికాలో వచ్చినట్టుంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత అమెరికా-భారత్ సంబంధాలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ బదులిచ్చారు. ఉక్రెయిన్‌ విషయంలో ఇండియా, అమెరికా రెండు దేశాలు తమ సొంత జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని… ఇలాంటి తరుణంలో ఇండియా, అమెరికాకు అనివార్య భాగస్వామి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా బహిరంగ ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ విలేకరులతో అన్నారు. రెండు దేశాల సంబంధాలపై పూర్తి నమ్మకం ఉందని… వచ్చే రోజుల్లో మరింత కలసికట్టుగా రెండు దేశాలు పనిచేస్తాయన్నారు.