Home Page SliderNational

ఫోన్ మాట్లాడుతూ రైల్ ఇంజన్ వచ్చేది పట్టించుకోని యువకుడు

ఆధునిక కాలంలో మనిషికి అత్యంత అవసరమైన పరికరం స్మార్ట్ ఫోన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క రోజు కూడా గడవలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం లేచినప్పటి నుండి మొదలు పెడితే, రాత్రి పడుకునే వరకూ అడుగడుగునా దీని అవసరం ఉంటోంది. ఇంతలా వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్.. ఓ నిండు ప్రాణాలు గాలిలో కలిసే స్థాయికి చేరుకుంది. ఓ వింత ఘటన యూపీలోని ఘాజీపూర్ లో చోటు చేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై కూర్చుని ఫోన్‌లో లీనమయ్యాడు. అదే సమయంలో ఓ రైలింజన్ వచ్చింది. హారన్ కొడుతున్న పట్టించుకోకుండా అలానే ఉన్నాడు. రైల్ ఇంజన్ దగ్గరికి వచ్చిన తర్వాత లేచి నిలబడ్డాడు.. కోపోద్రిక్తుడైన రైలు డ్రైవర్ కిందకి దిగి రాయి విసిరడంతో ఆ యువకుడు పరుగులు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.