భారతదేశంలో ఏ భాష ఎక్కువగా మాట్లాడతారు కోట్లలో?
భారత దేశంలోని చాలా రాష్ట్రాల్లో హిందీ భాష వినియోగంలో ఉంది. ఓ నివేదిక ప్రకారం దాదాపు 52.82 కోట్ల మంది హిందీలో మాట్లాడతారు. బెంగాలీని 9.72 కోట్ల మంది మాట్లాడితే, 8.30 కోట్ల మంది మరాఠీలో మాట్లాడతారు. ఇక 8.11 కోట్ల మంది తెలుగులో మాట్లాడతారు, 6.90 కోట్ల మంది తమిళంలో మాట్లాడుతున్నారు. 5.54 కోట్ల మంది గుజరాతీలో మాట్లాడతారు., 5.07 కోట్ల మంది ఉర్దూలో మాట్లాడతారు, కన్నడ భాషను 4.37 కోట్ల మంది మాట్లాడతారు., 3.75 కోట్ల మంది ఒడియాలో మాట్లాడతారు, మలయాళం మాట్లాడేవారు 3.48 కోట్ల మంది ఉన్నారు.