“ఏపీ సీఎం విడుదల చేసింది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా”:బుగ్గన
ఏపీ సీఎం చంద్రబాబు నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై విడదల చేసిన శ్వేతపత్రంలో అన్ని అబద్దాలే ఉన్నాయని మాజీ మంత్రి బుగ్గన ఆరోపించారు. కాగా అది శ్వేతపత్రమా? లేదా సాకు పత్రమా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు డకౌట్ అయ్యేలా ఉన్నాయని బుగ్గన ఎద్దేవా చేశారు.సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రజలు పథకాలపై పెట్టుకున్న ఆశల్ని నీరు గార్చేలా మాట్లాడారన్నారు.అయితే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేసిన అప్పులపై పసుపు మీడియా ఎందుకు ప్రస్తావించట్లేదని బుగ్గన టీడీపీని దుయ్యబట్టారు.

