Breaking NewsHome Page Slider

నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది?

సంఘీభావం తెలిపేవారికి నోటీసులు ఇవ్వడాన్ని నారా భువనేశ్వరి తప్పుబట్టారు.

అమరావతి: చంద్రబాబుకు మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది అని నారా భువనేశ్వరి ప్రశ్నించారు. సంఘీభావం తెలిపే వారికి నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టారు.

చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది. నాకు మనోధైర్యం కోసం పార్టీ శ్రేణులు యాత్ర చేపడితే తప్పేముంది. పార్టీ కార్యకర్తలు మాబిడ్డల్లాంటి వాళ్లు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇస్తారా? నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కు ఎక్కడిది అని ప్రశ్నిస్తూ భువనేశ్వరి ట్వీట్ చేశారు.