‘ఆపరేషన్ సింధూర్’పై ప్రపంచదేశాలు ఎటువైపు?
భారత ఆడబిడ్డల కళ్లముందే భర్తలను హత్య చేసి, వారి నుదిటి బొట్టు చెరిపేసిన పాక్ ఉగ్రవాదులను మట్టుపెట్టడమే ధ్యేయంగా భారత ప్రభుత్వం ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్(బొట్టు) పేరు పెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకి పాక్ ఉగ్రవాదులపై మెరుపుదాడి చేసింది భారత సైన్యం. ఈ దాడులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. ఈ దాడిలో దాదాపు 80 ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. బవహల్పూర్( జైషే మహ్మద్), మురిద్కే (లష్కర్ తొయిబా) క్యాంపుల్లోనే అత్యధికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. రెండు శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఎవరూ కోరుకోకూడదని, భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. ఘర్షణలు వద్దు. ప్రపంచానికి శాంతి కావాలి అంటూ పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ రాయబారి భారత్ ఆత్మరక్షణ కోసమే దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి, దాక్కోవడం కుదరదని ఉగ్రవాదులు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ప్రపంచదేశాల మద్దతు భారత్‌వైపే ఉందని అర్థమవుతోంది.