Home Page SlidermoviesNationalTrending Today

సూపర్ హిట్ మూవీ ఛావా ఓటీటీలో ఎప్పుడంటే..

దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఛావా చిత్రం ఓటీటీలో రావడానికి సిద్ధమయ్యింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ చిత్రం ఏప్రిల్ 11నుండి స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న బ్యూటీ రష్మిక, బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ చిత్రం హిందీలో అదరగొట్టడంతో, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో కూడా విడుదల చేశారు.