Home Page SliderNational

దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడంటే..?

దేశంలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ముందే జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది జూన్ 16తో ప్రస్తుత లోక్‌సభ గడువు ముగియనుంది. దీని ప్రకారం దేశంలో ఏప్రిల్-మేలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి.కానీ ఈసారి మార్చి-ఏప్రిల్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ వారంలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.