ఏపీ మహిళలకు ఉచితబస్సు ఎప్పుడంటే..
ఏపీలోని మహిళలకు ఎట్టకేలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటన వెలువడింది. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర మహిళలకు శుభవార్త చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా ప్రతీ నెలా మూడో శనివారం ఉద్యోగులు శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణాలు చేయించారు. గ్రామాలలోని చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకుని రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

