Home Page SliderNational

 RCB ఫ్యాన్స్ పూజలు ఫలించిన వేళ.. IPLలో అదరగొట్టిన కోహ్లీ

దేశవ్యాప్తంగా ఉన్న RCB అభిమానుల పూజలు ఫలించాయి. కాగా RCB టీమ్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే నిన్నటి మ్యాచ్‌లో పైచేయి సాధించాల్సివుంది. దీంతో నిన్నటి RCB VS SRH మ్యాచ్‌లో RCB ఎలాగైన గెలవాలని ఫ్యాన్స్ పూజలు చేసిన విషయం తెలిసిందే. కాగా వారి పూజలు ఫలించడంతో  ఈ IPL సీజన్‌లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి అదరగొట్టాడు. కాగా నిన్న జరిగిన SRH VS RCB మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. దీంతో RCB టీమ్ నిన్నటి మ్యాచ్‌లో విజయాన్ని సాధించడమే కాకుండా..SRH ను ఈ సీజన్ నుంచి ఇంటికి పంపించింది. అంతేకాకుండా IPL సీజన్‌లో 500కు పైగా పరుగులు ఆరుసార్లు సాధించిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు IPL లో అత్యధిక పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌తో కలిసి సమానంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే కోహ్లీ ఇప్పటివరకు జరిగిన IPL సీజన్లలలో 2011లో 557,2013లో 634,2015లో 505,2016లో 973,2018లో 530 ఈ ఏడాదిలో 538 పరుగులు చేశారు.కోహ్లీ తర్వాత ధావన్,కేఎల్ రాహుల్ 5 సార్లు 500పైగా పరుగులు సాధించారు. కాగా కోహ్లీ మాత్రం IPL లో 7,162 పరుగులతో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు.