Home Page SliderNational

“గుంటూరు కారం” ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత మహేష్ బాబు మాస్ రోల్‌లో కన్పించబోతున్నారు. దీంతో ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ మేరకు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన “ఓ మై బేబి సాంగ్” యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన లేటేస్ట్ అప్‌డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.దీని ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను వచ్చే ఏడాది జనవరి 6న జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకి మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా యంగ్ హీరోయిన్ శ్రీలీలా,మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.