బంగారం ఎప్పుడు కొంటే మంచిది
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి. ఎందుకంటే ఇప్పుడు తాత్సారం చేస్తే రాబోయే దీపావళి నాటికి దేశంలో బంగారం ధరలు కొండెక్కే అవకాశం ఉందని నిపుణులు చెపుతున్నారు. ఈ రోజుకు బంగారం ధరలో మార్పులు లేవు, కానీ వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. కిలో వెండి ధర 200 రూపాయలు పెరిగి 55, 200 రూపాయలకు చేరుకుంది. వచ్చేది పండుగల సీజన్. పైగా దసరా, దీపావళి వస్తున్నాయి, కాబట్టి బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశాలున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
22 కారెట్లు(10 గ్రాములు) 24 క్యారెట్లు (10 గ్రాములు) రూపాయలలో
హైదరాబాద్ 46,750 51,000
విజయవాడ 46,750, 51,000
చెన్నై 47,250, 51,760
ముంబయి 46,730 51,000
ఢిల్లీ 46,880 51,150
కోల్‌కతా 46,730 51,000
బెంగళూరు 46,780 51,050
కేరళ 46,730 51,000