తెలంగాణ ఎంసెట్ (TS EAPCET 2024) ఎప్పుడంటే?
ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష టీఎస్ ఎప్‌సెట్‌ను మే 9నుంచి ప్రారంభం
తెలంగాణ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ ను సెట్ కన్వీనర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్ లైన్‌లో అప్లై చేసుకోవచ్చని ఆయన చెప్పారు. మే 9 నుంచి 12 వరకు తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుందని ప్రకటించారు. గతంలో టీఎస్ ఎంసెట్‌గా ఉన్న పేరును తాజా ఈఏపీసెట్‌గా మార్చారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది.మరోవైపు తెలంగాణ ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19 వరకు కొనసాగుతాయి. దీనికిసంబంధించి ఇప్పటికే ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.

