ఏపీలో వేసవి సెలవులు ఎప్పుడంటే..?
ఏపీలో 10వ తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. దీంతో 10వ తరగతి విద్యార్థులకు సెలవులు లభించాయి. మరోవైపు ఏపీలో 1 నుంచి 9వ తరగతి విద్యార్ధులకు ఈ నెలలోనే ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీరికి ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే ఈ నెల 30 నుంచి వేసవి సెలవులు ఉంటాయని తెలిపింది. కాగా ఏపీలో ఈ నెల 27న పాఠశాల విద్యార్థుల పరీక్షలు ముగియనుండగా..మరో రెండు రోజులు ఫలితాల వెల్లడి,పేరెంట్స్ మీటింగ్స్ మొదలైనవి ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాగా ప్రతిరోజు రాష్ట్రంలో 40 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఉష్టోగ్రతలు మరింతగా పెరిగితే మాత్రం ఈ సెలవులు కాస్త ముందుగానే ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు మళ్లీ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.