Home Page SliderTelangana

తెలంగాణాలో మహంకాళి బోనాలు ఎప్పుడంటే..?

 తెలంగాణా ప్రభుత్వం ఇటీవల సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి ఆలయానికి నూతన కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ఇవాళ కొత్తగా ఏర్పడ్డ కమిటీ సభ్యుల  ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించింది. కాగా ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో జూలై నెల 9న అమ్మవారి బోనాలు,10న రంగం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మంత్రి శ్రీనివాస్ గత ఏడాది కంటే ఈసారి రెట్టింపు అభివృద్దితో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా ఈసారి  బోనాలకు అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని  మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.