Home Page SliderNational

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే..?

దేశంలో ఎన్డీయే కూటమి వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ కూడా  ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతించినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.దీంతో ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నయని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని  ఆయన వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న కేంద్ర బడ్జెట్ 2024-2025 ని పార్లమెంటులో ప్రవేశపెడతారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.