Andhra PradeshHome Page Slider

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?

ఏపీలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రభుత్వంలో సీఎం కేబినెట్‌తోపాటు అసెంబ్లీ స్పీకర్ కూడా ఖరారు అయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీలో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ నెల 21 నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని అధికారులు తాజాగా వెల్లడించారు. అయితే ఈ సమావేశాలు కేవలం రెండు రోజులే జరుగుతాయని అధికారులు తెలిపారు. ఆ రెండు రోజులు కూడా మొదట సభ్యుల ప్రమాణ స్వీకారం,స్పీకర్ ఎన్నిక ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.