వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు
కొత్త ఫీచర్లను పరిచయం చేయనున్న వాట్సాప్ ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది… కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్ వచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్లను తీసుకొచ్చే యోచనలో ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ను చెరిపేస్తే తిరిగి పొందే సదుపాయం లేదు. త్వరలో యూజర్లకు `అన్ డూ’ బటన్‌ను వాట్సాప్ అందించనుంది. ఒకరికి పంపిన మెసేజ్‌ను డిలీట్ చేస్తే, డిలీట్ ఫర్ మీ, డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఆఫ్షన్లు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు డిలీట్ ఫర్ మీ ఆఫ్షన్ ఎంచుకుంటే, ఆ వెంటనే `అన్ డూ’ బటన్ కూడా దర్శనమిస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్ వెర్షన్‌లో భాగంగా కొద్ది మందికే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరిచయం చేయనుంది. అదేమిటి అంటే గుర్తు తెలియని యూజర్లు తమ ఫోన్ నంబర్ చూడకుండా హైడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ ఫీచర్లతో త్వరలో అప్ డేటెడ్ వెర్షన్ రానుంది.

