Home Page SliderTrending Today

ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సాప్- కొత్తఫీచర్

ఒకేసారి నాలుగు ఫోన్లలో వాడుకునేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ డెస్క్ టాప్, మొబైల్, లాప్ టాప్‌లలో మాత్రమే వాట్సాప్‌ను వాడుతున్నాము. ఫోన్లలో కేవలం ఒకఫోన్‌ను మాత్రమే వాట్సాప్‌కు కనెక్ట్ చేయవచ్చు. మరో ఫోన్‌లో లాగిన్ అయితే ఈ ఫోన్ నుండి లాగౌట్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఇకమీదట ఈ సమస్య ఉండదు. ఒకేసారి నాలుగు ఫోన్లు కూడా ఉపయోగించుకోవచ్చు. లాప్‌టాప్‌లో లాగిన్ అయినట్లుగానే లింక్ డివైజ్‌ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వేరే ఫోన్‌లో కూడా లాగిన్ అవవచ్చు.

అయితే ఈ ఫోన్లలో లైవ్ లొకేషన్, బ్రాడ్ కాస్ట్ లిస్ట్ క్రియేట్ చేయడం వంటి ఫీచర్లు సాధ్యం కావు. ఈ ఫీచర్ చిన్న బిజినెస్‌లకు ప్రయోజనకరంగా ఉంటుంది. వినియోగదారుల కోసం ఒకే నెంబరుతో వాట్సాప్‌ను వాడుకోవచ్చు. కానీ కనీసం 14 రోజులకొకసారి ప్రైమరీ ఫోన్‌తో కనెక్ట్ కావాల్సి ఉంది. లేదంటే ఆటోమేటిగ్గా అన్ని ఫోన్ల నుండి లాగౌట్ అయిపోతుంది. ఇది త్వరలోనే వినియోగంలోకి రానుంది.