ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి మండలంలోని చుంచుపల్లి తండాకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న మనోజ్(15) అనే బాలుడికి, తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న పల్లవితో చనువు ఏర్పడింది. ప్రతి రోజు మనోజ్, పల్లవితో వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

