వైఎస్, కేసీఆర్ ఫొటోలు ఉంటే తప్పేంటి..?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా ఇంట్లో వైఎస్ఆర్, కేసీఆర్ ఫొటోలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఫొటో ఇంకా రాలేదు’ అని అన్నారు. నాయకుల విషయంలో ఇంట్లో నచ్చిన లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటి? ఎవరి అభిమానం వాళ్లదని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా విషయంలో కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు. మా ఏరియాకు వస్తే ఊరుకునేది లేదని రంగనాథ్ కు చెప్పానని తెలిపారు. తనపై 173 కేసులు కూడా ఉన్నాయని, అవసరమైతే జైలుకు పోతాను కానీ కాంప్రమైజ్ కానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన అంశంపై శాసనసభ కార్యదర్శి పంపిన తనకు అందలేదని, నోటీసులు వచ్చాక స్పందిస్తానని చెప్పారు.