వాట్సప్ పనిచేస్తోంది..!
రెండు గంటలుగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నిలిచిపోయాయి. వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు అయోమయానికి గురయ్యారు. వాట్సాప్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని సంబంధిత అధికారులు సైతం వెల్లడించారు. అయితే వాట్సాప్ లో ఇప్పటికీ కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా వాట్సాప్ సేవలు దాదాపు రెండు గంటల వరకు నిలిచిపోయాయి. టెక్నికల్ సమస్య తలెత్తడంతో మెసేజ్‌లను పంపడం, రిసీవ్ చేసుకోవడం ఆగిపోయింది. వాట్సాప్ మెసేజ్ డెలివరీ అయినట్టు టిక్ మార్క్ కూడా కనిపించలేదు. ఇది వాట్సప్ చరిత్రలో అతిపెద్ద అంతరాయంగా భావిస్తున్నారు. ప్రముఖ ఆన్‌లైన్ టూల్ డౌన్ డిటెక్టర్ మధ్యాహ్నం 12.07 గంటల నుంచి సమస్యలు వస్తున్నాయంటూ ఆందోళనలు మొదలయ్యాయి. భారతదేశంలోని వినియోగదారుల ఆధారంగా WhatsApp అతిపెద్ద మార్కెట్ అయిన భారతదేశంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత ఇలాంటి రాకపోకలు లేవన్న అభిప్రాయం స్పష్టమైంది. ఇటలీ, టర్కీకి చెందిన సోషల్ మీడియా వినియోగదారులు కూడా సందేశాలు పంపలేకపోతున్నారని పోస్ట్ చేశారు. UK అంతటా ఉన్న వినియోగదారులకు సందేశ సేవ నిలిపివేశారని BBC నివేదించింది.

