Home Page SliderInternationalNews

“ఈ దాడిపై ప్రపంచం ఏం మాట్లాడదా”..జెలెన్‌స్కీ

రష్యా తాజాగా తమ దేశంపై ఖండాంతర క్షిపణి ప్రయోగించడాన్ని విమర్శించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ దాడి అత్యంత తీవ్రమైనదని, దీనిపై ప్రపంచం మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రపంచదేశాలు స్పందించాలని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యుద్ధాన్ని తీవ్రతరం చేయడానికి పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్షిపణి మా ప్రాంతంలోని అతిపెద్ద నగరాలలో నిప్రోను ఢీకొట్టింది. ఈ చర్యల ద్వారా యుద్ధాన్ని విస్తరించాలని పుతిన్ ఆలోచనగా తెలుస్తోంది. అతనికి శాంతి చర్యలపై ఆసక్తి లేదని అర్థమవుతోందన్నారు. ఇప్పటికే అమెరికా కీవ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.