డైరెక్టర్ అనిల్ రావిపూడికి శ్రీలీల ఏమవుతారంటే..?
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “భగవంత్ కేసరి”.ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. కాగా ఈ సినిమాలో ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.కాగా శ్రీలీల తనకు కోడలు అవుతుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే శ్రీలీల స్వస్థలమైన పొంగలూరు తన అమ్మమ్మగారి ఊరని శ్రీలీల తల్లి తనకు వరుసకు అక్క అవుతారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే శ్రీలీల షూటింగ్‌లో ఉన్నప్పుడు తనని మామయ్య అని ఆటపట్టించేదని అనిల్ రావిపూడి వెల్లడించారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించారు. కాగా ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు.