Home Page SliderNationalPolitics

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్‌లో  ఏం తేలింది..

మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి హవా కొనసాగుతోందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే విజయం కోసం ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయితే పలు సర్వే సంస్థల నివేదికల ప్రకారం అంచనాలు తలకిందులయ్యాయి. అధిక శాతం ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపినట్లు వెల్లడి అయ్యింది. ప్రముఖ సర్వే సంస్థల నివేదికల ప్రకారం బీజపీకే అధిక మార్కులు పడ్డాయి.

పీపుల్స్ పల్స్ అనే సంస్థ నివేదిక ద్వారా మహారాష్ట్రలో బీజేపీకి 182, కాంగ్రెస్‌కు 97, ఇతరులకు 9 సీట్లు వస్తాయని సమాచారం.  అలాగే ఝార్ఖండ్‌లో బీజేపీ కూటమికి 46-58 వస్తే, జేఎంఎం కూటమికి 24- 37, ఇతరులకు 10 వరకూ స్థానాలు ప్రకటించింది.

చాణక్య అనే సంస్థ మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి 152 -160, ఇండియా కూటమికి 130-138 స్థానాలు రావొచ్చని అభిప్రాయపడింది. ఝార్ఖండ్‌లో ఎన్డీయేకి 45-50, జేఎంఎంకి 35-38 రావొచ్చని పేర్కొంది.

అయితే మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే తడవలో పోలింగ్ జరిగింది. ఝార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా పోలింగ్ జరిగింది.