ప్రజలకు ప్రభుత్వం చేసింది శూన్యం: రఘునందన్‌రావు
చేగుంట: ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. మంగళవారం చేగుంట మండలం ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, కరీంనగర్, సోమ్లా తండాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాల్లో మద్యం గొలుసు దుకాణాలను ఏర్పాటు చేయించి పచ్చని కాపురాల్లో బీఆర్ఎస్ చిచ్చుపెడుతోందన్నారు. చేగుంట మండలం రుక్మాపూర్‌లో రఘునందన్‌రావు మాట్లాడారు.


 
							 
							