బీజేపీ పార్టీ నెపోటిజాన్ని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంది.. సౌరభ్ భరధ్వాజ్
బీజేపీ పార్టీ నెపోటిజాన్ని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకుంది. తన పరివాద వాదం విషయంలో ఎంతవరకూ నిజాయితీగా ఉందని ప్రశ్నించారు ఆప్ లీడర్ సౌరభ్ భరధ్వాజ్. ఇప్పటికైనా ఈ విషయంలో స్పష్టత నిమ్మని డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీలో కుటుంబాలు లేవా ? కేవలం విపక్షాలలోని కుటుంబాలకే ఈ పరివాదవాదం వర్తింస్తుందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ నెపోటిజం గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అమిత్ షాకు, రాజనాథ్ సింగ్‌కు, అరుణ్ జైట్లీకి, అనురాగ్ ఠాకూర్ వంటి బీజేపీ పెద్దలకు కుటుంబాలు లేవా? కుటుంబసభ్యులు పదవిలో లేరా? అని విమర్శలు చేశారు. కేవలం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, లల్లూ పార్టీలపై ఎందుకు కుటుంబపార్టీలనే ముద్ర వేస్తోందని వాదించారు. బీజేపీ 40 ఏళ్ల పురాతన పార్టీ అనీ, ఎందరో బీజేపీ పెద్దల కుటుంబ సభ్యులు, వారసులు పార్టీలో ఉన్నారని గుర్తు చేశారు.