‘వాలంటీర్లపై ఏం చెప్పాలి?’..ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి డోలా బాలవీరాంజనేయు స్వామి సభ్యుల ప్రశ్నలకు జవాబు చెప్తూ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా?, వారికి జీతాలిస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా వాలంటీర్లపై ఏం చెప్పాలి? వారు మనుగడలోనే లేరని సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం వారిని రెన్యువల్ చేయకపోవడం వల్లే వారు ఉద్యోగులుగా లేరు. లేని ఉద్యోగులకు ఎలా జీతాలు చెల్లించాలంటూ ప్రశ్నించారు. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికే ప్రయత్నించామని, కానీ 2023 ఆగస్టులో వారిని రెన్యువల్ చేయాల్సి ఉండగా చేయలేదని, పైగా ఎన్నికల ముందు వారితో రాజీనామా చేయించారని పేర్కొన్నారు. ఆ వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని, గత ప్రభుత్వం రెన్యువల్ చేసి, జీవో ఇచ్చి ఉంటే వారికి వేతనాలు చెల్లించేవారమని పేర్కొన్నారు.

