కేంద్ర బడ్జెట్‌తో వేటి ధరలు పెరగనున్నాయ్ అంటే..!
కేంద్ర బడ్జెట్ ప్రకారం దేశంలోని పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ప్లాస్టిక్ ఉత్పత్తుల రేట్లు పెరగనున్నాయి. కాగా కేంద్రం ప్లాస్టిక్ ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీని 25 శాతానికి పెంచింది. అదే విధంగా కెమికల్స్,పెట్రో కెమికల్స్‌పైన కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచేసింది. దీంతో ఫెర్టిలైజర్లు,పురుగు మందుల తయారీలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు టెలికాం పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది.దీంతో వాటి ధరలు కూడా పెరిగే అవకాశముంది.