చంద్రబాబు ఆరోగ్యంపై వైద్య నివేదికలో ఏముందంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజుల నుంచి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా చంద్రబాబుకు జైలులో ప్రాణ హాని ఉందని నారా లోకేష్ ఇప్పటికే ఆరోపించారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు చంద్రబాబును పరీక్షించేందుకు వైద్యులను జైలుకు పంపించింది. జైలులో చంద్రబాబును పరీక్షించిన వైద్యలు ఆయన ఆరోగ్యంపై కీలక నివేదిక విడుదల చేశారు. ఈ నివేదికలో చంద్రబాబు గడ్డం,ఛాతీ,వీపు,చేతులు,మెడపా దద్దుర్లు ఉన్నట్లు గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా చంద్రబాబు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్థారించారు. అయితే ఈ నెల 12న చంద్రబాబును పరీక్షించిన వైద్యులు ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.