మునుగోడులో మొత్తం ఓటర్లు ఎంతంటే!
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల లెక్క తేలింది. ఈ నెల 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి మొత్తం ఓటర్లు సంఖ్య 2,41,795 మందిగా తేల్చారు. ఎన్నికల సంఘం మొత్తం ఓటర్ల సంఖ్యను అధికారికంగా ప్రకటించింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,795 మందిలో పురుషులు 1,21,662 మంది కాగా, మహిళలు 1,20,126 మంది, ట్రాన్స్‌జెండర్‌లు 7 మంది ఉన్నారు. అందులో కొత్త ఓటర్లు 15,980 మందిగా తేల్చారు. ఈ ఏడాది జనవరి 1 తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం మునుగోడులో మొత్తం ఓటర్లు 2,26,471 మంది కాగా, తాజా లెక్కల ప్రకారం 15,324 మంది ఓటర్లు పెరిగారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 4 తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదు కోసం 26,742 మంది దరఖాస్తు చేసుకొగా అందులో ఇంటింటికి తిరిగి విచారించి 10,762 మంది దరఖాస్తులను తొలగించారు. 15,980 మంది ఓటర్లను అర్హులుగా ప్రకటించారు.

